సాధించే వరకు ప్రయత్నాన్ని అపొద్దు
హసన్‌పర్తి: లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నాన్ని అపొద్దుని ప్రముఖ సినీదర్శకుడు వెంకీ అట్లూరి విద్యార్థులకు సూచించారు. నగరంలోని కిట్స్ కళాశాలలో జాతీయ స్థాయి దార్ధి కార్నివాల్ ‘సంస్కృతీ–25’ కార్యక్రమంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి ిసినీ దర్శకుడు వెంకీ అట్లూరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆశయం, లక్ష్యాన్ని ఛేదించే వరకు పట్టువదలకుండా కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతోగానో దోహదపడుతాయన్నా రు. కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో నాయకత్వపు లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు, సంగీతం వినడం, పుస్తక పఠనం చారిత్రాత్మక సినిమాలు చూడడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల బ్రోచర్‌ను విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ జడ్జీ కె.దేవీప్రసాద్, కిట్స్ పాలక మండలి సభ్యులు వెంకట్రామ్‌రెడ్డి, డీన్ ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ నరిసంహారావుతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సంస్కృతి–25 సందర్భంగా అక్షర్ బృందం ప్రదర్శించిన బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది.
సినీ దర్శకుడు వెంకీ అట్లూరి
కిట్స్‌లో ప్రారంభమైన ‘సంస్కృతి–25’
Comments
Please login to add a commentAdd a comment