![కళలు.](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07hmkd712-600502_mr-1738980809-0.jpg.webp?itok=uFqu8rK5)
కళలు.. సంస్కృతికి జీవం
హన్మకొండ కల్చరల్ : కళలు.. సంస్కృతికి జీవం పోస్తాయని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్ అధ్యక్షతన కళాశాల స్వర్ణోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రావీణ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రాచీన ఆచారాలు, కళలు, సంస్కృతి, సంగీత నృత్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భద్రకాళి శేషు మాట్లాడుతూ వీణ, కచేరీ, సంగీత కళాకారుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో నూతన కళాకారులను పోత్సహించే బాధ్యత సంగీత, నృత్య కళాశాల తీసుకోవడం అభినందనీయమన్నారు. అంతకు ముందుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, భద్రకాళి శేషు, ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్ మ్యూజిక్ టీచర్ వద్దిరాజు నివేదిత, హైదరాబాద్, వరంగల్ కళాకారులతో కలిసి తాగ్యరాజు కీర్తనలు అలపించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాస్కర్, అనుముల యోష, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఓని విజయ్, గడ్డం శంకర్, విద్యార్థులు, సంగీత కళాకారులు పాల్గొన్నారు. వేడుకల్లో వేదికపై 500 మందికి పైగా సంగీతగాత్రం, వయోలీన్, సీతార్, వీణా, కూచిపూడి, పేరిణి నృత్యం ఆకట్టుకున్నాయి.
కళలకు నిలయం విద్యారణ్య కళాశాల
కాళోజీ కళాక్షేత్రంలో
ఘనంగా స్వర్ణోత్సవం
కళాకారుల ప్రదర్శనలు
![కళలు.. సంస్కృతికి జీవం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07hmkd717-600502_mr-1738980810-1.jpg)
కళలు.. సంస్కృతికి జీవం
![కళలు.. సంస్కృతికి జీవం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07hmkd303-330157_mr-1738980810-2.jpg)
కళలు.. సంస్కృతికి జీవం
Comments
Please login to add a commentAdd a comment