చిక్కడపల్లి: పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా, మరికల్ గ్రామానికి చెందిన విజయకుమార్, చంద్రకళ దంపతుల కుమార్తె కె.రత్నకుమారి(24) పోటీ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్‌కు వచ్చి చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని తరంగిణి ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ నాగార్జున స్టడీ సర్కిల్‌లో గ్రూప్–2కు సన్నద్ధమవుతోంది.
సోమవారం సాయంత్రం ఆమె తాను ఉంటున్న గదిలో కాకుండా మరో గదిలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్, ఎస్‌ఐ సందీప్‌రెడ్డి వివరాలు సేకరించారు. రత్నకుమారికి గత ఏడాది ఆపరేషన్ జరిగిందని, మందులు కూడా వాడుతోందని పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ సందీప్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment