సాక్షి, రంగారెడ్డిజిల్లా/ పహడిషరీఫ్: ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం మహేశ్వరం బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టే కొనసాగింది. మంత్రి సబితపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాల్లో ఆమెకు ఉన్న అనుభవం, మంత్రిననే గర్వం కనీసం లేకపోవడం, ఓ సామన్య కార్యకర్తలా నిత్యం ప్రజలతోనే మమేకమై పోవడం, ఓపిక, హుందాతనం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధతే ప్రధాన అంశంగా సీఎం మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహేశ్వరం నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన శ్రీప్రజా ఆశీర్వాద సభశ్రీ నిర్వహించారు.సుమారు 25 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన ప్రసంగం మొత్తం మంత్రి సబిత చుట్టే కొనసాగించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన జనాన్ని చూసి సబిత గెలుపు ఖాయమైందని చెప్పారు. ఆమెకు భూదేవికున్నంత ఓపిక ఉందని, మంత్రిననే గర్వం కూడా తనలో కన్పించదని, ఓ సామాన్య కార్యకర్తల కష్టపడి పని చేస్తుందని, నియోకవర్గం అభివృద్ధి తప్పా మరే ఇతర వ్యాపకాలు ఆమెకు లేవని సీఎం కొనియాడటంతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హర్షద్వానాలు వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సహా మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితా హరినాధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మీర్‌పేట్ మేయర్ దుర్గా దీప్‌లాల్ తదితరులు హాజరయ్యారు.
గర్వపడే మనిషి కాదు..హుందాతనంతో ఉంటుంది
ఆమెకు ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం లేదు
మంత్రి సబిత చుట్టే సీఎం కేసీఆర్ ప్రసంగం
సంక్షేమం, అభివృద్ధి చూసి ఆదరించండి... మంత్రి సబితా ఇంద్రారెడ్డి
గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఏ ఇంటి గడప తొక్కినా పార్టీలకతీతంగా ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లకు పైబడి నిధులతో అభివృద్ధి చేశా నని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment