రూ.11.61 కోట్ల గంజాయి కాల్చివేత
703 కేసుల్లో పట్టుబడిన 7,951కిలోల మాదకద్రవ్యాలు
సాక్షి, సిటీబ్యూరో: ఎకై ్సజ్ అధికారులు పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 7,951 కిలోల గంజాయి, డ్రగ్స్‌ను మంగళవారం దహనం చేశారు. వీటి విలువ రూ.11.61 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఏఓబీ ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి సరఫరా అయ్యే గంజాయి, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి అయిన డ్రగ్స్‌పై గత అక్టోబర్‌లో 703 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పట్టుబడిన 7,951 కిలోల గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చివేశారు. పలు జిల్లాల్లోని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లలో ఈ మేరకు కేసులు నమోదు చేసి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు హ్యాష్ ఆయిల్, అల్ఫాజోలం, వీట్ ఆయిల్, ఓపీఎం, ఎండీఎంఏ వంటి డ్రగ్స్‌ను ఎకై ్సజ్ పోలీసులు దహనం చేశారు. చాలాకాలంగా స్టేషన్‌లలో నిల్వ చేసిన గంజాయి, డ్రగ్స్‌ను దహనం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.75 కోట్ల విలువైన మత్తు పదార్ధాలు ఇంకా నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వాటిని కూడా దహనం చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment