కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సాక్షి, సిటీబ్యూరో: తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు చైల్డ్ కేర్ సంస్థలు మంచి భవిష్యత్ అందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన చైల్డ్ కేర్ సంస్థలకు లైసెన్స్ రెన్యువల్ జారీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
చైల్డ్ కేర్ సంస్థల్లో అనాథ పిల్లలకు విద్య అందించేందుకు లక్ష్యం నిర్దేశించుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం పిల్లల దత్తత కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త భవనాలు, మరమ్మతులు, స్థలం, వేకెన్సీ నివేదికను పంపాలని సూచించారు. పిల్లల పట్ల ఆప్యాయత, ప్రేమ కనబర్చాలని, పిల్లల బాల్యం ఆనందంగా గడిచేలా వారి బాగోగులు చూడాలన్నారు.
ఈ సందర్భంగా 50 చైల్డ్ కేర్ సంస్థలకు కొత్త లైసెన్స్‌లను అందించారు. సీసీఐలు చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment