ఫుడ్ ఫెస్టివల్స్‌తో మత్స్యకారులకు ప్రోత్సాహం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్
ఖైరతాబాద్: ఫుడ్ఫెస్టివల్స్ ఏర్పాటుతో మత్స్యకారులకు ప్రోత్సాహం దక్కుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఫెస్టివల్స్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆల్ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫెర్నాండో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు, నాయకులు అన్వేష్‌రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రీతం నాగరికరీ, ముత్తినేని వీరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment