లోక్మంథన్లో
మాదాపూర్లోని శిల్పారామంలో గురువారం ప్రారంభమైన లోక్మంథన్లో సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సమాలోచనలు ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ క్రీడలు, అల్లికలు, వివిధ కళలను ప్రదర్శించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవంలో చర్మ వాయిద్యాల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 350కి పైగా పురాతన సంప్రదాయ సంగీత వాద్యాలు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. సందర్శకులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు వీటిని ఉత్సాహంగా తిలకించారు. – మాదాపూర్
Comments
Please login to add a commentAdd a comment