సభను అడ్డుకుంటాం: బీఆర్ఎస్వీ
ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా డిసెంబరు 18, 21 తేదీల్లో నిర్వహించనున్న కృతజ్ఞత మహాసభలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గదరాజు చందు పేర్కొన్నారు. గురువారం ఓయూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీల మూతపడుతున్నాయన్నారు. ఉద్యోగాల భర్తీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాష్ట్రంలో ఎక్కడ కృతజ్ఞత సభ పెట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీడీ అనీల్, జంగయ్య, రవి, కొంపెల్లి నరేష్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment