ఇదేం వి‘చిత్రమో’
రూ.150 కోట్లతో రంగుల బొమ్మలు
జూ పార్కుకు అయిదోసారి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
పెరిగిన చలి
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చలి పెరిగింది. తెల్లవారుజామున పొగ మంచు కమ్మేస్తోంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం రాత్రి చలి తీవ్రత పెరిగింది. సగటున కనిష్ట ఉష్ణోగ్రత 15.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శివార్లలో మాత్రం అత్యల్పంగా సగటున 12.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయింది. గురువారం పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలుగా నమోదైంది.
నగరంలో సక్రమంగా లేని నడక మార్గాలు
● పలుచోట్ల పాదచారులకు ప్రమాదాలు
● జంక్షన్ల సుందరీకరణతోనే సరిపెట్టొద్దు
● ఫుట్‌పాత్‌లకూ ప్రాధాన్యం ఇవ్వాలి
● గ్రేటర్‌లో 9 వేల కి.మీ పైగా రోడ్లు
● 900 కి.మీ. మేరనైనా కనిపించని కాలిబాటలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పలు జంక్షన్లు, రోడ్ల పక్కన గోడలు, ఫ్లై ఓవర్ల స్తంభాలు తదితర ప్రాంతాల్లో చూడచక్కని బొమ్మలు రంగుల హంగులతో చూపరులను కట్టి పడేస్తున్నాయి. నగరం అందంగా కనిపించేందుకు ఈ పనులు చేస్తుండటంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. వీటితో పాటు పాదచారులు నడిచేందుకు నడక మార్గాలను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్లు వెలువడుతున్నాయి. గ్రేటర్ నగరంలో 9 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లున్నప్పటికీ కనీసం 900 కిలోమీటర్ల మేరనైనా పాదచారులు నడిచేందుకు కాలిబాటలు (ఫుట్‌పాత్‌లు) లేవు. నగర అందాన్ని మాత్రం పట్టించుకుంటున్న అధికారులు, సంబంధిత యంత్రాంగం దాంతో పాటు ప్రజల సదుపాయాల్ని కూడా పట్టించుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సుందరీకరణల కోసమే 224 ప్రాంతాల్లో దాదాపు రూ. 150 కోట్లతో పనులు చేపట్టారు. వీటిల్లో రూ.5.35 కోట్ల విలువైన రంగుల హంగుల సుందరీకరణ పనులు పూర్తికాగా, 209 ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ప్రజలను ఆకట్టుకునేలా ప్రత్యేకమైన థీమ్‌లతో చిత్రాలు వేస్తున్నామని, జంక్షన్లు, సెంట్రల్ మీడియన్లలో ప్రత్యేక ఆక ర్షణగా శిల్పాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సీఆర్‌ఎంపీ మార్గాల్లోనూ లేవు..
సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్ (సీఆర్‌ఎంపీ) కింద ప్రైవేటు ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ బాధ్యతలప్పగించిన ప్రాంతాల్లో అన్ని రోడ్లకూ ఫుట్‌పాత్‌లు కూడా ఉండాల్సినప్పటికీ.. ఆయా మార్గాల్లో సైతం ఇవి లేకుండాపోయాయి. అంతేకాదు.. సంబంధిత మార్గాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పనుల బాధ్యతలు కూడా సదరు ఏజెన్సీలవే. కానీ.. సదరు ఏజెన్సీలు ఆ పనులు చేయకున్నా, జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. వచ్చే నెలాఖరుతో ఆయా ఏజెన్సీల నిర్వహణ గడువు తీరిపోనుంది. తిరిగి మళ్లీ సమగ్ర నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం.. గడువు ముగిసిపోతున్నా చేయని పనుల్ని మాత్రం పట్టించుకోలేదు.
● సీఆర్‌ఎంపీ పరిధిలో 525 మార్గాల్లో 812 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, వాటిలో 650 కిలోమీటర్ల మేర నడిచేందుకు సదుపాయంగా ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు. ఇలా ఇటు సీఆర్‌ఎంపీ మార్గాల్లో కాంట్రాక్టు ఏజెన్సీలు కానీ, మిగతా ప్రాంతాల్లో అటు జీహెచ్‌ఎంసీ కానీ ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు. పాదచారులను గురించి పట్టించుకోలేదు. నడకదారులు లేక పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాల బాధితుల్లో 40 శాతానికి పైగా పాదచారులే ఉండటం గమనార్హం. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారూ ఉన్నారు.
‘స్మార్ట్’ కళ్లద్దాలతో ఆత్మవిశ్వాసం: గవర్నర్
రాంగోపాల్‌పేట్: కంటిచూపు కరువైనవారి జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఏఐ బేస్డ్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ (దృష్టి) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపేలా స్మార్ట్ కళ్లద్దాలు ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. స్మార్ట్ గ్లాసులు అంధుల రోజువారీ జీవితాల్లోనూ ఎంతో ఉపయోగంగా ఉంటాయని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. స్మార్ట్ కళ్లద్దాలు రూపొంందించడంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు. వ్యక్తుల ముఖాల గుర్తింపుతో పాటు వారితో ధైర్యంగా మాట్లాడేందుకు ఈ కళ్లద్దాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ కిమ్స్ ఫౌండేష్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలతో అంధులు తమచుట్టు పక్కల ప్రాంతాల్లో సులభంగా తిరగడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో కేఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ డాక్టర్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌పాత్ లేకపోవడంతో రోడ్డు పక్కనుంచి వెళ్తున్న ఓ పాదచారి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కు వరుసగా అయిదోసారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఓ) గుర్తింపు సర్టిఫికెట్ గుర్తింపు పొందింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.శివయ్య ఐఎస్‌ఓ–9001:2015 సర్టిఫికెట్ 2024–2025ను గురువారం జూపార్కు కార్యాలయంలో తెలంగాణ జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమత్, జూపార్కు క్యూరేటర్ జె.వసంత బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ వసంత మాట్లాడుతూ.. మెరుగైన నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన పెంపకం, సహకార పరిశోధన సామర్థ్యంతో పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి వంటివి తనిఖీ చేసిన అనంతరం ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందజేస్తారని తెలిపారు. వీటన్నింటిపై జూ పార్కు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కనబర్చడంతో అయిదోసారి కూడా ఈ గౌరవం జూ పార్కుకు దక్కిందన్నారు.
గత అయిదేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పాదచారులు ఇలా..
సంవత్సరం మరణాలు
2019 95
2020 72
2021 94
2022 123
2023 121
Comments
Please login to add a commentAdd a comment