అబిడ్స్: గోషామహల్ పోలీస్ స్టేడియాన్ని పలు శాఖలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై ఉన్నతాధికారులు చర్చించారు. గోషామహల్ ప్రాంతంలో ఉన్న 52 ఎకరాల స్థలంలో 25 ఎకరాలు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం, మిగతా 27 ఎకరాల్లో ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని అధికారులు పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరి దాన కిషోర్, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌డీఓ రామకృష్ణ, నాంపల్లి తహశీల్దార్ మన్నె ప్రేమ్‌కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా గోషామహల్ అలస్కా చౌరస్తా నుంచి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వరకు, మరో వైపు ప్రస్తుతం ఉన్న బేగంబజార్ పోలీస్‌స్టేషన్ వరకు, చుట్టుపక్కల ఉన్న పోలీస్ శాఖకు చెందిన ప్రభుత్వ పోలీస్ స్థలాలను కూడా అధికారుల బృందం పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment