కేబీఆర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడుగులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రద్దీని నియంత్రించేందుకు వాహనదారులు తేలిగ్గా ముందుకు సాగేందుకు వీలుగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం ప్రాజెక్ట్ ఇంజినీర్లు పనులు వేగవంతం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పిల్లర్లు వేసే ప్రాంతాల్లో భూ పరీక్షలు జరిపేందుకు మార్కింగ్ చేశారు. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. భూ పరీక్షలు జరిపే ప్రాంతంలో పిల్లర్లు వేయడానికి ఆ ప్రాంతం అనువుగా ఉంటుందా? ఉండదా? అనే విషయంపై తొలుత మట్టి పరీక్షలు నిర్వహిస్తారు.
ఇందుకోసం ఎక్కడెక్కడ భూ పరీక్షలు చేపట్టాలో అందుకోసం స్థలాలను గుర్తించి మార్కింగ్‌లు కూడా వేశారు. గడచిన అయిదు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా రోడ్డునంబర్–45 బాలకృష్ణ ఇంటి వైపు, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, భారతీయ విద్యా భవన్స్ స్కూల్ వైపు, అగ్రసేన్ చౌరస్తా, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 వైపు ఈ ఫ్లైఓవర్లను నిర్మించే ప్రతిపాదనలు రూపొందించారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే డిజైన్లు పూర్తయ్యాయి. ఇందుకనుగుణంగానే ఎక్కడెక్కడ పిల్లర్లు నిర్మించాలో ఆ ప్రాంతాల్లో మార్కింగ్ పూర్తి చేశారు. ప్రాథమికంగా భూ పరీక్షలు పూర్తయిన తర్వాత పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. అయితే.. పిల్లర్ల నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూ పరీక్షలు, ఆ తర్వాత జరిగే డిజైన్ల రూపకల్పన, ప్రతిపాదనల తయారీ వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాతే ఫ్లైఓవర్ల పిల్లర్ల నిర్మాణం చేపడతారు. మరోవైపు పిల్లర్ల నిర్మాణం చేపడితే ట్రాఫిక్ ఏ రకంగా మళ్లించాలో కూడా రెండు మూడు పర్యాయాలు సంబంధిత అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఫ్లైఓవర్ల నిర్మాణానికి మార్కింగ్ చేసిన ఇంజినీర్లు
భూ పరీక్షల కోసం మార్కింగ్..
పిల్లర్లు నిర్మించే ప్రాంతాల్లో భూమి పరిస్థితిపై ఆరా
సాంకేతికతను వినియోగించుకుంటున్న ఇంజినీర్లు
Comments
Please login to add a commentAdd a comment