కంటోన్మెంట్‌కు అరుదైన గుర్తింపు
ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై న బోర్డు
రసూల్‌పురా: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ప్రతిష్టాత్మక రక్షణ మంత్రిత్వ అందించే శాఖ స్వచ్ఛ్ ఛవానీ– స్వస్త్ ఛవానీ కేటగిరీలో ‘ఎక్సలెన్స్– 2024’ అవార్డు లభించింది. దేశంలోని 61 కంటోన్మెంట్లలో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో రక్షణ మంత్రిత్వ శాఖ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు పెద్దపీట వేసింది. 41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 వార్డుల్లో 95 వాహనాల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ, పారిశుద్ధ్య కార్మికుల సమర్థ విధి, అధిక పరిశుభ్రత ప్రమాణాల నిర్వహణ విభాగంలో ఈ అవార్డు లభించింది. బోర్డు అధికారుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించడాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. గుర్రపు డెక్కతో నిండి ఉన్న రామన్నకుంట చెరువు శుభ్రపరచడంలో బోర్డు శానిటేషన్ అధికారులు పూర్తిగా విజయం సాధించారు. పర్యావరణ పరిరక్షణకు 15 వేలకుపైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ.. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల ద్వారా ఎక్సలెన్స్ అవార్డు లభించిందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆరోగ్య వంతమైన ప్రాంతంగా రూపొందించడంలో అగ్రగామిగా కొనసాగుతోందని ఆయన కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment