14 నుంచి మృదంగ విద్వాంసులు ‘ఎల్లా’ 75 ఏళ్ల వేడుకలు | - | Sakshi
Sakshi News home page

14 నుంచి మృదంగ విద్వాంసులు ‘ఎల్లా’ 75 ఏళ్ల వేడుకలు

Published Wed, Dec 11 2024 7:06 AM | Last Updated on Wed, Dec 11 2024 7:06 AM

14 నుంచి మృదంగ విద్వాంసులు ‘ఎల్లా’ 75 ఏళ్ల వేడుకలు

14 నుంచి మృదంగ విద్వాంసులు ‘ఎల్లా’ 75 ఏళ్ల వేడుకలు

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు ప్లాటినం (75 ఏళ్ల) జూబ్లీ వేడుకలు ఈ నెల 14న జరుగనున్నాయి. ఈ విషయాన్ని వేడుకల నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎల్లా శిష్యబృందం ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ, కళాసాగరం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ నెల 14న వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని మీనాక్షి సుందరం హాల్‌లో పదుల సంఖ్యలో ఎల్లా శిష్యులు స్థానిక గాయకుల పాటలకు మృదంగ సహకారం అందిస్తారని, 15వ తేదీన రవీంద్రభారతిలో ఎల్లాకు సన్మానం జరుగుతుందన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి మంత్రులు సహా రాజకీయ, భిన్న రంగాల ప్రముఖులు హాజరవుతున్నారని, ఈ సందర్భంగా ఎల్లా స్వయంగా సమర్పించే మృదంగ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement