సాక్షి, సిటీబ్యూరో: ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం అవినీతి నిరోధఖ శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చాలామంది బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్నారు. దీంతో ఆ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు బందోబస్తు కొనసాగింది. బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ ఉంది. దీంతో పోలీసులు ఈ రెండింటికీ మధ్య ఉన్న ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా బలగాలను మోహరించారు. తెలంగాణ భవన్‌కు వచ్చిపోయే నాయకులు, కార్యకర్తలపై నిఘా వేసి ఉంచారు. అలాగే నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటున్న కీలక బీఆర్‌ఎస్ నాయకుల కదలికల్నీ గమనించారు. ఇటీవల గాంధీభవన్–బీజేపీ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment