సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించండి
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
రాయికల్: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండలం అల్లీపూర్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. అధికారులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించి వివరాలు చెప్పాలని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వీటి ద్వారానే సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందుతాయన్నారు. నిధుల కొరతతో కొన్ని పథకాలు జాప్యం అవుతున్నాయని, త్వరలోనే అన్ని పథకాలు అమలు చేస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment