గల్ఫ్ ట్రావెల్స్ ఎదుట ఆందోళన
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్‌లో గల ఓ గల్ఫ్ ట్రావెల్స్ ఎదుట మెట్‌పల్లికి చెందిన శివ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. మెట్‌పల్లికి చెందిన శివ దుబాయ్ వెళ్లేందుకు కరీంనగర్‌రోడ్‌లోని ఓ గల్ఫ్ ట్రావెల్స్ యజమానికి మూడునెలల క్రితం పాస్‌పోర్టు అప్పగించాడు. వీసా రాకపోవడంతో పాస్‌పోర్ట్ కావాలని ట్రావెల్స్ నిర్వాహకులను శివ అడగగా.. రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు మెట్‌పల్లికి చెందిన ఎంఐఎం అధ్యక్షుడు అఖిల్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ రజియోద్దీన్‌తో కలిసి ట్రావెల్స్‌కు చేరుకుని ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. సోమవారం పాస్‌పోర్టు అప్పగిస్తామని గల్ఫ్ ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో శాంతించి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment