గీత కార్మికుడి బలవన్మరణం
రామడుగు(చొప్పదండి): వెదిర గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రం లింగస్వామి(75) అప్పుల బాధతోపాటు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రామడుగు పోలీసులు తెలిపారు. మృతుడికి కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భూమి కోసం డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు
బోయినపల్లి(చొప్పదండి): గతంలో విక్రయించిన భూమికి మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తూ సాగుచేయకుండా ఇబ్బంది పెడుతున్న మండలంలోని దుండ్రపల్లికి చెందిన స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ శనివారం తెలిపారు. దుండ్రపల్లికి చెందిన స్వామి, నర్సమ్మలు తమ పేరిట ఉన్న భూమిని 1997లో అదే గ్రామానికి చెందిన కొమురమ్మ, పోచమల్లులకు విక్రయించారు. అప్పటి ధర ప్రకారం భూమికి డబ్బులు చెల్లించారు. కొన్ని రోజుల తర్వాత స్వామి తాను భూమి విక్రయంచలేదంటూ కొమురమ్మ, పోచమల్లులను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. డబ్బులు ఇస్తేనే భూమి దున్ననిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రెవెన్యూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ రిజిష్ట్రేషన్ క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో రూరల్ సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కొండగట్టు అంజన్న ప్రసాదం తూకంలో వ్యత్యాసం
● ఫిర్యాదు చేసిన భక్తుడు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న సన్నిధిలో లడ్డూ, పులిహోర ప్రసాదం తూకంలో వ్యత్యాసం వచ్చింది. శనివారం హైద రాబాద్‌కు చెందిన ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకొని, 200 గ్రాముల పులిహోర కొనుగోలు చేశాడు. అనుమానం వచ్చి, సంబంధిత అధికారి ముందు తూకం వేయాలని కోరాడు. తూకం వేయగా పులిహోర బరువు 160 నుంచి 170 గ్రాములే ఉండటంతో అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై ఆలయ ఈవో రామకృష్ణారావును వివరణ కోరగా భక్తుడి ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని, సంబంధిత ఇన్‌చార్జితో మాట్లాడతానని పేర్కొన్నారు.
ఇటుక బట్టీ కార్మికురాలి మృతి
సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని కదంబాపూర్ శివారులోని ఇటుక బట్టీలో ఓ కార్మికురాలు మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన దంపతులు ము కుందో గౌరి–లక్ష్మీగౌరి 15 రోజుల క్రితం కదంబాపూర్ ఎస్‌బీఐ ఇటుకబట్టీలో పనిలో చేరా రు. లక్ష్మీగౌరి శనివారం పని ముగించుకొని, మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లి, ప్రమాదవశాస్తు జారి పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమవగా, స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్ప టికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment