ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలి
జగిత్యాలటౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీ మేరకు రాత పరీక్ష లేకుండా తమ సర్వీసును క్ర మబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రెండో ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు గాండ్ల మధురిమ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, స మస్యల పరిష్కారం కోరుతూ శనివారం పట్టణంలో ని కరీంనగర్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన మల్టీపర్పస్ ఫిమే ల్ హెల్త్ అసిస్టెంట్ పరీక్షలను రద్దు చేయాలని డి మాండ్ చేశారు. తమ సేవలు, సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చే యాలని కోరారు. ఏఎన్‌ఎంలను సముదాయించిన పోలీసులు ఆందోళన విరమింపచేశారు. కార్యక్రమంలో సంఘం ప్రఽతినిధులు మమత, జయప్రద, జిల్లాలోని పలువురు రెండో ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment