భూ దందా | - | Sakshi
Sakshi News home page

భూ దందా

Published Mon, Dec 30 2024 1:00 AM | Last Updated on Mon, Dec 30 2024 1:00 AM

-

ట్యాపింగ్‌..

జనవరి: కరీంనగర్‌లో భూ దందాలపై సీపీ అభిషేక్‌ మహంతి ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ)తో విరుచుకుపడ్డారు. ‘దళితబంధు’ నిధులు వెనక్కి మళ్లడం, పథకం పేరు చెప్పి కొందరు అధికారులు రాజభోగాలు అనుభవిస్తున్న తీరుపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ప్రభుత్వం సదరు అధికారులపై వేటు వేసింది. కరీంనగర్‌ బల్దియాలో రెండేళ్లుగా వేతనం లేకుండా కొనసాగుతున్న ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావుపై వేటు పడింది. జగిత్యాల నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణం సూత్రధారి సత్తార్‌ ముఠాపై సీఐడీ కేసు నమోదు చేసింది.

ఫిబ్రవరి: కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి కరీంనగర్‌లోని రైల్వే పనులకు రూ.647 కోట్లు కేటాయించారు. శాతవాహన వర్సిటీలో 410మందికి వేతనాలు ఆమోదించాలన్న ప్రతిపాదనను సభ్యులు వ్యతిరేకిండంతో నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఎందుకివ్వరని ‘సాక్షి’ వార్త ప్రచురించింది. ఫిబ్రవరి 9న కేంద్రం ఆయనకు భారతరత్న ప్రకటించింది. కరీంనగర్‌ శివారు బొమ్మకల్‌ ఆర్‌యూబీ వద్ద 2016 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించి, రోడ్డు విస్తరణకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌లో సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచేందుకు ఓ నేత తన పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలకు కార్లు బహుమతిగా ఇచ్చారన్న వార్త సంచలనం రేపింది. 80శాతం అంధత్వం ఉన్న క్లర్క్‌ దంపతులపై తిమ్మాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. రామడుగు మండలం వెలిచాలకు చెందిన సాయికిరణ్‌ సివిల్స్‌ ఫలితాల్లో ఆలిండియా 27వ ర్యాంకు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement