మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించా రు. బుధవారం మధ్యాహ్నం ఓ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ ఆసిఫోద్దీన్, సహకరించిన కార్యాల య సబార్డినేట్ బానోత్ రవి, లంచం డబ్బులు తీసుకున్న డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకా రం.. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌కు చెందిన సుంకె విష్ణు మెట్‌పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో 266 గజాల భూమిని కొనుగోలు చేశాడు. సేల్‌డీడ్ చేసుకున్న విష్ణు కొద్దిరోజులకే మార్ట్‌గేజ్ చేసుకునేందుకు గత నెల 28న స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలో మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయానికి వెళ్లిన విష్ణు సబ్‌రిజిస్ట్రార్‌ను కలిస్తే రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని తన సబార్డినేట్‌కు ఇవ్వాలని సూచించాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో సార్‌తోనే మాట్లాడుకోవాలని సభార్డినేట్ బదులిచ్చాడు. మరలా సబ్‌రిజిస్ట్రార్‌ను కలవగా రూ.9వేలు ఇవ్వాలని చెప్పగా రూ.5 వేలు ఇస్తానని తేల్చిచెప్పాడు. అనంతరం బా ధితుడు ఏసీబీ అధికారులను సంపద్రించాడు. బుధవారం కార్యాలయానికి వెళ్తున్నట్లు ఏసీబీ అధి కారులకు సమాచారం ఇచ్చిన బాధితుడు మొదట సబ్‌రిజిస్ట్రార్, సబార్డినేట్‌ను కలిశాడు. డాక్యుమెంట్ రై టర్ అసిస్టెంట్ అయిన ఆర్మూర్ రవిని కలిసి రూ.5 వేలు ఇవ్వాలని వారు సూచించారు. అప్పటికే అక్క డ నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు లంచం డబ్బులు తీసుకుంటుండగా రవిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతన్ని విచారించగా జరిగిన మొత్తాన్ని వివరించాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్, సబార్డినేట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు.
భూమి మార్ట్‌గేజ్‌కు సబ్‌రిజిస్ట్రార్ రూ.10వేలు డిమాండ్
రూ.5వేలకు కుదిరిన ఒప్పందం
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment