యువకుడి ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): కన్నాల గ్రామ పంచాయతీ పరిధి బోడగుట్టపల్లి గ్రామానికి చెందిన చిందం శ్రీనివాస్(25) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చే సుకున్నాడు. స్థానికుల క థనం ప్రకారం.. చిందం మల్లయ్య– దంపతులకు సత్యనారాయణ, శ్రీనివాస్ కుమారులు. మల్లయ్య 20ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. సత్యనారాయణ ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. శ్రీనివాస్ బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో అప్రెంటిషిప్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ బుగ్గ రామస్వామి ఆలయం ప్రాంతంలో గడ్డిమందు తాగి, విషయాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు తెలిపాడు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతుడి సోదరుడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేస్తారని స్థానికులు తెలిపారు. కాగా శ్రీనివాస్ ప్రేమవ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. తమకు ఫిర్యాదు అందలేదని బసంత్‌నగర్ పోలీసులు తెలిపారు.
10 తులాల బంగారం చోరీ
కథలాపూర్: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో అంగరి రేణుక ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేణుక తన ఇంట్లోని స్టీల్‌డబ్బాలో 10తులాల బంగారు ఆభరణాలు ఉంచింది. ఈనెల 13న చూడగా ఆభరణాలు కనిపించలేదు. ఇంట్లో వెతికిన లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 14న కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని, వారి కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment