రామగిరి కోటను టూరిజం హబ్‌గా మార్చండి
మంథని: కాళేశ్వరం, మంథని, రామగిరి ప్రాంతాలను ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూ ట్‌గా గుర్తించి అభివద్ధి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను కలిశారు. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, రామగిరి కోటను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్నారు. దక్షిణకాశీ కాళేశ్వర ముక్వీశ్వరస్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని, దేశంలో మరెక్కడా కనిపించని విధంగా గర్భగుడిలో రెండు శివలింగాలు పూజలు అందుకుంటున్నాయని వివరించారు. ఒకటి ముక్వీశ్వరునిది(శివుడు), మరొకటి కాళేశ్వరునిది(యముడు)దని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 2027లోనూ గోదావరి పుష్కరాలు ఇక్కడే జరుగుతాయని, కోటి మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరారు. రామగిరి కోటకు సుమారు 1,200 ఏళ్ల చరిత్ర ఉందనిచ రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. రాముడి ఆలయాలు, జలపాతాలు, అనేక ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్నిఆకర్షణలు ఇక్కడ ఉన్నాయని, స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు మంత్రి శ్రీధర్‌బాబు వినతి
Comments
Please login to add a commentAdd a comment