ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో నివాసముంటున్న బోడవల్లి సుదీక్ష(23) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అత్తింటివారే తమ కూతురును హత్యచేసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, సుదీక్ష బంధువులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన సుదీక్షను నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన బోగవల్లి జానీ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నిరోజులకు సుదీక్షను భర్తతోపాటు అత్తింటివారు వేధింపులకు గురిచేయడంతో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండేళ్ల నుంచి వీరు ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఉంటున్నారు. ఈనెల 14న సాయంత్రం సుదీక్షను ఆమె భర్త జానీ చున్నీతో ఉరేసి హత్యచేసినట్లు మృతురాలి తల్లి లింగంపల్లి కళావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ నీరంజన్‌రెడ్డి, ఏఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. తహసీల్దార్ ప్రసాద్ పంచనామా చేశారు. మృతురాలి తల్లి లింగంపల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు.
అత్తింటివారే హత్య చేశారని ఆరోపిస్తున్న మృతురాలి తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment