స్వచ్ఛతలో ప్రగతి అభినందనీయం
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లాలో స్వచ్ఛతలో ప్రగతి అభినందనీయమని యూనిసెఫ్ ఢిల్లీ ప్రతినిధులు ఫౌలేజీ వర్క్‌నే, మనీష్ వసూజ అన్నారు. సంస్థ సహకారంతో చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలు తెలుసుకునేందుకు వారు గురువారం జిల్లాకు వచ్చారు. ముందుగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యూనిసెఫ్ సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. సంస్థ సహకారంతో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చామన్నారు. పంచాయతీల నిధుల నుంచి ప్రీమియం చెల్లిస్తూ పారిశుధ్య కార్మికులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన కింద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధిలో వెలిచాల ఆదర్శం
రామడుగు(చొప్పదండి): వెలిచాల అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని యూనిసెఫ్ ప్రతినిధులు ఫౌలేజీ వర్క్‌నే, మనీష్ వసూజ ప్రసంశించారు. గురువారం గ్రామంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్‌లతో కలిసి పర్యటించారు. తాగునీటి సరఫరా, పాఠశాలలో కిచెన్ గార్డెన్, అంగన్‌వాడీ కేంద్రం, వైద్య సిబ్బంది సేవలను కలెక్టర్ వారికి వివరించారు. సంస్థ ప్రతినిధులు వెంకటేశ్, ప్రభాత్, ఫణీంద్ర, డీఆర్‌డీవో శ్రీధర్, డీడబ్ల్యూవో సబిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ప్రకాశ్, యూనిసెఫ్ కో–ఆర్డినేటర్ కిషన్‌స్వామి, ఎంపీడీవో రాజేశ్వరి, గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కస్తూరి తదితరులు పాల్గొన్నారు.
యూనిసెఫ్ ఢిల్లీ ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment