ట్రాక్టర్‌కింద పడి యజమాని దుర్మరణం
దేవరుప్పుల: వ్యవసాయంతోపాటు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ట్రాక్టర్ తీసుకున్న ఓవ్యక్తి దానికింద పడి మంగళవారం అక్కడికక్కడే దుర్మరణం పొందిన ఘటన నీర్మాల–రామరాజుపల్లి మధ్య చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని ధర్మాపురం రెవెన్యూ పరిధి లక్ష్మణ్‌తండా గ్రామానికి చెందిన బానోత్ రాజు(26) సొంత ట్రాక్టర్ ద్వారా కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఇటుక తదితర సామగ్రి సరఫరా చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మక్కపల్లి నుంచి రామరాజుపల్లికి ఇటుక లోడుతో బయలు దేరాడు. నీర్మాల, రామరాజుపల్లి మధ్య ట్రాక్టర్ బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ వెంకన్న అప్రమత్తం కోసం పక్కకు ఆపే క్రమంలో ప్రమాదవశాత్తు ఇంజన్‌డబ్బాపై కూర్చున్న యజమాని రాజు కిందపడిపోయాడు. ఇది గమనించని డ్రైవర్ తిరిగి ట్రాక్టర్ ఆన్‌చేసి వెళ్లే క్రమంలో ఇటుక లోడు ఉన్న డబ్బా టైరు ఎక్కడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. ఈ విషయమై మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment