ర్యాలీని జయప్రదం చేయాలి
జనగామ రూరల్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తేదీన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ర్యాలీకి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ జమాల్ షరీఫ్, పట్టణ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ మోటె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment