గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి
దేవరుప్పుల: మండలంలోని మారుమూల గిరిజన ఆవాసప్రాంతమైన నల్లకుంటతండాలో గుడుంబా తయారీ స్థావరంపై ఎస్సై ఊర సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం తండాలోని బానోత్ బుజ్జి ఇంటి ఆవరణలో 70 లీటర్ల బెల్లం పానకం, బానోత్ జ్యోతి ఇంట్లో 100 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. ఈ సంఘటనపై తదుపరి చర్యలు తీసుకునేందుకు పాలకుర్తి ఎకై ్సజ్ పోలీసు అధికారులకు సిఫారసు చేసినట్టు ఎస్సై తెలిపారు. గిరిజనులు ప్రత్యామ్నాయ ఆదాయం పేరిట గుడుంబా తయారు చేసి తమ పరిసర గ్రామాల పేద కుటుంబాల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు. జీవనోపాధి పొందేందుకు అనేక మార్గాలు ఉంటాయని హితవు పలికారు. దాడిలో పోలీసు సిబ్బంది యాకేష్, మసూద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment