జనగామ
బుధవారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
చట్టాలపై అవగాహన ఉండాలి
9
సమ్మెను ఉధృతం చేస్తాం
● ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌజన్య
జనగామ రూరల్: ప్రభుత్వ మొండి వైఖ రి వీడి సమగ్ర శిక్ష ఉద్యోగులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని, లేదంటే టీ చింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో కలిసి సమ్మెను ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మెలో పాల్గొని మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరి ష్కరించాలన్నారు. అలాగే సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, ఉప్పల వసంత, లావణ్య, వెంకటేశ్వర్లు, కనకయ్య, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తా డూరు రమేష్, ప్రధాన కార్యదర్శి దయాకర్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీలత, సుకన్య, శివకుమార్, స్వామి ఉమాపతి, విజయ, సుకన్య, రాణి పాల్గొన్నారు.
క్రీడాకారుల
మార్చ్‌ఫాస్ట్..
నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రారంభమైన 43వ తెలంగాణ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న జనగామ, మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి జిల్లాల క్రీడాకారులు.
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: వినియోగదారులు చట్టాలపై అవగాహన ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ విధానం, వర్చువల్ విచారణలతో విని యోగదారులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచుకోవా లని, కొనుగోలు చేసి ఉపయోగించే ప్రతీ వస్తువు పై జాగ్రత్త వహించాలన్నారు. అంతకుముందు వినియోగదారుల చైర్మన్ సాధిక్ అలీ, సభ్యులు నవీన్ శర్మ, విద్యార్థులు వినియోగదారుల హక్కులపై ప్రసంగించి, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్‌ఓ సరస్వతి, డీఏఓ రామారావు నాయక్, డీఎం సీఎస్ హతీరామ్, ఏసీఎస్‌ఓ ఇర్ఫాన్ ఖాన్, రవీందర్ గౌడ్, శ్రీనివాస్, దేవా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment