సాధారణ ప్రసవాలు పెంచాలి
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెంచాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోస్టర్ ప్లాన్‌ను అనుసరించి వైద్యులు ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో సమయపాలన పాటించాలని, విధుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పాటించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పనితీరు ను సరిచూసుకోవాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులు, మెడికల్ ఆఫీసర్లు 15 రోజులకు ఒకసారి సబ్‌సెంటర్ సిబ్బంది, వైద్యులతో సేవల పురోగతిపై సమీక్ష న్విహించాలని పేర్కొన్నారు. ఎన్‌సీడీ కేసుల్లో స్క్రీనింగ్ పూర్తిచేసి ఈనెల 25వ తేదీలోగా తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎన్టీఈపీ కేసుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల వైద్యాధికారులు ప్రగతి సాధించాలని, ప్రత్యేక అధికారిని పీఓగా నియమించాలని సూచించారు. ఆర్‌బీఎస్‌కేల ద్వారా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆర్థోపెడిక్, పిడియాట్రిక్ కేసులపై శ్రద్ధ వహించాలని తెలిపారు. రక్త పరీక్షలు పెంచడంతో పాటు ఔషధాల నిల్వలు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలి
సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment