బాలికా విద్యతోనే సామాజిక చైతన్యం
జనగామ రూరల్: బాలికా విద్యతోనే సామాజిక చైతన్యం.. సావిత్రిబాయి పూలే జీవితం ప్రతీ ఆడపిల్ల ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. నాటి సమాజంలో ఆడపిల్లకు చదువు ఉండే ది కాదని, అంటరానితనం, కుల, లింగ వివక్ష ఎక్కువగా ఉండేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో తొమ్మిదేళ్ల వయసున్న సావిత్రిబాయి పూలేకు వివాహం అయిందని, అయితే.. ఆడపిల్ల చదువుకోవాలనే ఆలోచనతో తన 18వ ఏట 54 పాఠశాలలను స్థాపించి ఎంతో మంది ఆడబిడ్డలకు స్ఫూర్తి గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఆడపిల్ల చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మధ్యలో ఆపొద్దని, సావిత్రిబాయి ఆలోచనలను ముందుతరాలకు అందించాలని కోరారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులు, మహిళా ఎంఈఓలను సత్కరించారు. అంతకు ముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియాబేగం, ఏఎంఓ శ్రీనివాస్, ఏపీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment