ఇందిరమ్మ ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలి
● డీపీఓ స్వరూపారాణి
స్టేషన్‌ఘన్‌పూర్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరితగతి న పూర్తి చేయాలని డీపీఓ స్వరూపారాణి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలో నిర్వహిస్తున్న సర్వే ను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 90శాతం సర్వే పూర్తయిందని, రెండు రోజుల్లో మొత్తం కావాలన్నా రు. పంచాయతీ కార్యదర్శులు లింగయ్య, శ్రీకాంత్, సిబ్బంది శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
బచ్చన్నపేట : గ్రామ పంచాయతీల్లో రికార్డులను సక్రమంగా నిర్వర్తించాలని డీపీఓ స్వరూపారాణి అన్నారు. శుక్రవారం ఆలింపూర్‌లో జీపీ రికార్డుల ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తూ పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లికార్జున్, ఏపీఓ కృష్ణ, మాజీ సర్పంచ్ నరెడ్ల బాల్‌రెడ్డి, కార్యదర్శి రేవతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment