ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● టీఎన్జీఓ జిల్లా జాక్ అధ్యక్షుడు ఖాజాషరీఫ్
జనగామ రూరల్: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ జిల్లా జాక్ అధ్యక్షుడు ఖాజాషరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరు రమేశ్ ఆధ్వర్యాన సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం కొనసాగింది. దీక్షా శిబిరం వద్ద ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు 18 ఏళ్లుగా సేవలందిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. వీరిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో చర్చలు జరిపి ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్, పేరువారం ప్రభాకర్, జ్యోతి, సమగ్ర శిక్ష ఉద్యోగులు దయాకర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నరేష్, జ్యోతి, శోభ,నీరజ, అన్నపూర్ణ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment