వైభవంగా భోగి
నేడు సంక్రాంతి ● రేపు కనుమ
జనగామ: సంక్రాంతి పండుగకు స్వాగ తం పలుకుతూ జిల్లా ప్రజలు సోమవా రం భోగి పండుగను వైభవంగా జరుపుకున్నారు. హరివిల్లుల్లాంటి రంగవల్లులు, సంస్కృతిని ప్రతిభింబించే నృత్యాలు, డూడూ బసవన్నల విన్యాసాలు, హ రిదాసు కీర్తనలు, భోగ భాగ్యాలు ఇచ్చే భోగి మంటలు, భోగి పండ్ల సందడి, సాంప్రదాయ ఆటలతో పెద్ద పండుగ కొ లువు దీరింది. పిండి వంటల ఘుమఘుమలు, నోములతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. అనుబంధాలు, ఆత్మీయ పలకరింపులతో పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.
భక్తిశ్రద్ధలతో భోగి
భోగి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారు జామున ఇంట్లోని పిడకలు, కర్రలతో భోగి మంటలను వేశారు. పాత వస్తువులతో పాటు మనుషుల్లో దాగి ఉన్న చెడు గుణాలను అగ్నిలో దహింప జేసి, కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భోగి మంటలు వేస్తారు. ఆ తర్వాత తలకు నువ్వుల నూనె అంటించుకుని, చన్నీళ్ల స్నానమాచరించారు. నూతన వస్త్రాలను ధరించి, సూర్యునికి ఇష్టమైన పాయసం తయారు చేసి నైవేద్యంగా సమర్పించా రు. ఏ బాధలు ఉన్నా తొలిగిపోవాలని వేడుకున్నారు. చిన్న పిల్లలకు భోగి పళ్ల ను పోశారు. గంగిరెద్దులకు వస్త్రాలు, బి య్యం దానం చేసి భక్తిని చాటుకున్నారు. హరిదాసుకు కట్నాలు సమర్పించి, నేటి మకర సంక్రాంతికి స్వాగతం పలికారు.
గోదారంగ నాథుల కల్యాణం
భోగి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాణాపురం వేంకటేశ్వర స్వా మి ఆలయంతో పాటు రైల్వేస్టేషన్ ఏరి యాలోని చెన్నకేశ్వర, బాణాపురం అంజ నేయ స్వామి, చిల్పూరు బుగులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా దేవి కల్యాణం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా నిర్వహించారు. కాగా బొమ్మల కొలువు అందరినీ ఆక ట్టుకోగా గంగిరెద్దుల గంటల చప్పుళ్లు సన్నాయి వాయిధ్యాలు పల్లెలను మేలుకొలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment