కౌశిక్‌రెడ్డి అరెస్ట్ హేయమైనచర్య
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ: బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను చట్టబద్ధంగా ప్రశ్నించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నిజాలను నిగ్గు తేల్చే ప్రజా గొంతుకలను సహించలేక ఈ ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందన్నారు. కేవలం ప్రశ్నించినందుకే అక్రమంగా మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులపై స్పీకర్ చొరవ తీసుకొని న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ బలోపేతానికి కృషి
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రతీఒక్కకరికి చేరేలా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికై న మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. వివిధ మండలాలకు చెందిన అధ్యక్షులు ఎన్నిక కాగా వారికి నియామక ప త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, ఉడుగులు రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, రా జశేఖర్, రమేశ్, కోటి, ఉపేందర్, చంద్రయ్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు. దూల్మిట్ట కె.యాదగిరి, మద్దూరు ఉదయ్‌రెడ్డి, చేర్యాల సంజీవ్, జనగామ పట్టణం అనిల్‌కుమార్, జనగామ రూరల్ మహేశ్, తరిగొప్పుల శ్రీనివాస్, రాయపర్తి అనిల్, తొర్రూరు మున్సిపాలిటీ రాజశ్, కొడకండ్ల ఉపేందర్, తొర్రూరు రూరల్ రాంబాబు, పెద్దవంగర సుధాకర్, దేవరుప్పుల రాజు, పాలకుర్తి రవికుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ వెంకట్‌రమణ, వేలేరు రాజు, లింగాలఘణపురం సంపత్‌లను మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
మాదిగలది ధర్మపోరాటం
స్టేషన్‌ఘన్‌పూర్: ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ధర్మ పోరాటం చేస్తుండగా మాలలు అధర్మంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో ‘లక్ష డప్పుడు–వేల గొంతులు’ సభకు సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుర్రం నవీన్ అధ్యక్షతన స్థానిక అంబేడ్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మాదిగల లక్ష డప్పులు–వేల గొంతులు సభకు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్, మురళీకృష్ణ, ప్రతాప్, రవీందర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల సాధనకు ఉద్యమించండి
జనగామ రూరల్: కార్మిక హక్కుల సాధనకు ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు యాటల సోమన్న పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు అన్నబోయిన రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ నిరంతరం కార్మిక సమస్యలపై పోరాడుతున్న ఏకై క కార్మిక సంఘం సీఐటీయూ అని దేశంలోనే అత్యధిక సభ్యత్వంతో అగ్రగామి కార్మిక సంఘంగా ఉందన్నారు. జనగామ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్, బూడిద ప్రశాంత్, వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్, సుభాషిని, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సోములు, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment