గోమాతను పూజిస్తే విశేష ఫలితాలు
లింగాలఘణపురం: గోమాతను పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారని శ్రీరామదాసు భజన మండలి రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎం.సిద్ధ్వేర్ అన్నారు. కనుము పండుగ సందర్భంగా బుధవారం మండలంలోని చీటూరు శివాలయంలో హింధూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా బాధ్యుడు శ్రీరాంరెడ్డి కృష్ణమూర్తి ఆదేశాలతో మనగుడి కార్యక్రమంలో భాగంగా గోమాత పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త మండలి అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సులోచన, నర్సింహ్ములు, అనిల్‌రెడ్డి, రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, పుష్ప, సుగణ పాల్గొన్నారు.
జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపిక
జఫర్‌గఢ్: మండల కేంద్రమైన జఫర్‌గఢ్ ప్రభు త్వ ఆదర్శ పాఠశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని కె.హన్సిక జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ బుధవారం తెలిపారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ లెవెల్ షూటింగ్ బాల్ పోటీల్లో హన్సిక ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 16 తేదీ నుంచి ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభను కనబర్చి ఉత్తమ క్రీడాకారిణిగా రాణించాలని కోరారు. కాగా పాఠశాల నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న హన్సి కను ప్రిన్సిపాల్ శ్రీకాంత్, పీఈటీలు బి.రాజు, ఏ శ్రీనాథ్, ఉపాధ్యాయులు అభినందించారు.
18న జాబ్‌మేళా
జనగామ రూరల్: జనగామలోని శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 30 ఉద్యోగాలకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న (శనివారం) ఉదయం 10:30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే బిజినెస్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయని, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అ ర్హులన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో జాబ్‌మేళాకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 7995430401ను సంప్రదించాలన్నారు.
నవోదయ అర్హత పరీక్ష..
2025–26 సంవత్సరానికి గాను ఈ నెల 18న జవహర్ నవోదయ విద్యాలయ అర్హత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో (80) మంది విద్యార్థుల అర్హత పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11:30 గంటలకు పరీక్ష ఉంటుందని, ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష పర్యవేక్షణకు ప్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు.
అర్జీల స్వీకరణ
కాజీపేట అర్బన్ : హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17వ తేదీన అర్జీల ను హనుమకొండ జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో స్వీకరించనున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అఽఽధికారి హేమకళ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment