రిటర్న్ జర్నీ.. రిస్కీ
మల్లన్న ఆలయంలో మహాసంప్రోక్షణ
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ముగియడంతో మహాసంప్రోక్షణ నిర్వహించారు.
సకల కళా కోవిదులు ..
వరంగల్ ఆటోనగర్‌లోని లూయిస్ అంధుల పాఠశాల విద్యార్థులు ఆటలు, పాటలు, మిమిక్రీలో రాణిస్తున్నారు. ఈ సకల కళా కోవిదులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– 8లోu
● సంక్రాంతి పండగకు వచ్చిన
కుటుంబాల తిరుగుపయనం
జనగామ: సంక్రాంతి పండగ ముగిసింది.. వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వచ్చిన వారు తిరుగుపమయనమయ్యారు. అందరూ ఒకేసారి బయలుదేరడంతో రిటర్న్ జర్నీ రిస్కీగా మారింది. జనగా మ ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, జఫర్‌గఢ్, నర్మెట తదితర మండలాల బస్‌షెల్టర్ల వద్ద వందల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఒక్కో బస్సులో వంద మందికి పైగా ప్రయాణిస్తూ ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అదనపు బస్సులు నడిపించినా రద్దీ పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment