సకాలంలో వైద్యం అందించాలి
పాలకుర్తిటౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావుతో కలిసి ఓపీ బ్లాక్, ఔషధాల స్టోర్ ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రిజిస్టర్లు పరిశీలించి వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా విధులకు హాజరుకాని, విధులకు వచ్చి అందుబాటులో లేకుండా వెళ్లిపోయిన 14 మంది వైద్య సిబ్బందికి కలెక్టర్ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయ న విధులను నిర్లక్ష్యంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఆస్పత్రి వేళల్లో అందుబాటులో ఉండాలని, విధిగా రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స చేసి మందులు అందజేయాలన్నారు. సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలని, మాతాశిశు మరణాల సంఖ్య పూర్తిగా తగ్గించాలని, బాలింతలు, గర్భిణులు రక్త హీనతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం లక్ష్మీనారాయణపురంలో సంక్షేమ పథకాల అమలు సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు : డీఎంహెచ్‌ఓ
నర్మెట: వైద్య సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్ అన్నా రు. స్థానిక పీహెచ్‌సీని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, గదులను, పరిసరా లు, వసతులను పరిశీలించారు. రెండు రోజులుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాజరుకాని ఫార్మసిస్టు అనిల్‌కుమార్‌కు మెమో జారీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు సీహెచ్.ఉదయకిరణ్, ప్రసన్నకృష్ణ, దేవేందర్ ఉన్నారు.
విధులను నిర్లక్ష్యంచేస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
14 మంది వైద్య సిబ్బందికి నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment