హైవే అంధకారం
● వెలగని సెంట్రల్ లైటింగ్ సిస్టం●
● రాత్రి సమయాల్లో దుకాణాల లైట్లే దిక్కు
దేవరుప్పుల : జనగామ–సూర్యాపేట రహదారి దేవరుప్పుల చౌరస్తాలో ఇరువైపులా అర కిలోమీట ర్ మేర సెంట్రల్ లైటింగ్ మరమ్మతులకు నోచుకోక హైవే అంధకారంగా మారింది. నాలుగేళ్ల క్రితం సింగరాజుపల్లి కేంద్రంగా టోల్‌గేట్ వసూళ్లు మొదలైన క్రమంలో ఆదిలోనే సెంట్రల్ లైటింగ్ అపహాస్యంగా మారింది. 1033 టోల్ర్‌ీఫీ నంబర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించిన దాఖలాలు లేవని వాహనదారులు అంటున్నారు. టోల్‌గేట్ వసూలు చేస్తున్నప్పుడు పలు కూడళ్లలో వాహనదారులకు విశ్రాంతి తీసుకునే వెసులుబాటులో భాగంగా ఇలాంటి మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ అవసరం. ఈ విషయమై పలుసార్లు ఫిర్యాదు చేయగా ఎడాదిన్నర క్రితం లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ వేసినా సాంకేతిక కారణాలతో మూన్నాళ్ల ముచ్చటగా మారింది. రాత్రి వేళల్లో దుకాణదారుల లైట్లు, జీపీ ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల మాదిరి లైట్లు దిక్కయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment