మినీ జాతర పనులను త్వరగా పూర్తిచేయాలి
● ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం శ్రీసమ్మక్క–సారలమ్మ మినీ జాతర పనులను త్వరగా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మేడారంలో ఆయన గురువారం ఆకస్మికంగా పర్యటించి దేవాదాయశాఖ క్యూలైన్, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు రోజులపాటు జరిగే మినీ మేడారం జాతరను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని, పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. భక్తులు క్యూలైన్‌లో గద్దెల ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తోపులాట జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జంపన్న వాగు ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment