ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తాం..
లింగాలఘణపురం: దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరానికి సాగునీరందిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మె ల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో కురుమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆవిష్కరించిన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడు తూ స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు నియోజకవర్గాలకు సాగునీరందించే కాల్వ పెండింగ్ పనుల్లో వేగం పెంచాలని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి బిల్లులు కూడా ఇప్పిస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి నవాబుపేట రిజ ర్వాయర్‌లోకి వచ్చే ప్రధాన కాల్వ పూడికతీత పనులకు రూ.160 కోట్లు మంజూరు చేయించినట్లు తెలి పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. యాసంగిలో చెరువులు నింపడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, అధికారులు అలసత్వం వహించకుండా పనులు చేయాలని సూచించారు. అశ్వరావుపల్లి ప్రధాన కాల్వ పనుల్లో అక్కడక్కడా బాటిల్‌నెక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈనెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈ సుధీర్, డీఈ రవీందర్, ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్ రవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, జీడికల్ దేవస్థాన చైర్మన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సహకరించాలి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Comments
Please login to add a commentAdd a comment