సర్వే షురూ..
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రైతుభరోసా(పెట్టుబడిసాయం), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేలు), కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ సర్వే గురువారం ప్రారంభమైయింది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అధికారుల బృందాలు గ్రామాల బాటపట్టాయి. జిల్లాలో 283 గ్రామ పంచాయతీలు, 176 రెవెన్యూ గ్రామాలు ఉండగా క్లస్టర్లుగా గుర్తించి మొత్తం 140 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారుల ముసాయిదాను సిద్ధం చేస్తారు. 21 నుంచి 24 వరకు ప్రజాపాలన గ్రామ సభలు, 21 నుంచి 25 వరకు అర్హుల జాబితా డాటా ఎంట్రీ పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా మొదటి రోజు 69 గ్రామాల్లో సర్వే విజయవంతంగా చేపట్టారు.
అర్హులు దరఖాస్తు చేసుకోండి
లింగాలఘణపురం: రేషన్‌కార్డులు రానివారిలో అర్హులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండల కేంద్రంలో రేషన్‌కార్డుల సర్వేను పరిశీలించారు. ప్రస్తుతం వచ్చిన జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని, విడతల వారీగా మళ్లీ కొత్త రేషన్‌కార్డులు వస్తాయని చెప్పారు. సర్వే బృందాని కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహసీ ల్దార్ రవీందర్, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి, పంచాయ తీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, సర్వే బృందం తదితరులు ఉన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : మండల పరిధి నీర్మాలలో కొనసాగుతున్న గ్రామ సమగ్ర సర్వేలో రైతు భరోసా, ఆత్మీయ పథకంతో పాటు రేషన్‌కార్డుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆరా తీశారు. తప్పుడు సమాచారాలను నమ్మకుండా విశ్వసనీయతతో పారదర్శకంగా సర్వే చేపట్టి ప్రభుత్వ లక్ష్యసాధనకు దోహదపడాలని సిబ్బందికి సూచించారు. ఇన్‌చార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్, కార్యదర్శి భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు 69 గ్రామాల్లో..
క్షేత్ర స్థాయిలో అధికారుల బృందం
Comments
Please login to add a commentAdd a comment