‘సిక్లీగర్ సిక్’ నూతన కమిటీ
జనగామ: ‘సిక్లీగర్ సిక్’ కమ్యూనిటీ జిల్లా నూతన కమిటీని గురువారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన గురుద్వారా శ్రీ గురు సింగ్ సభకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి సిక్కులు తరలి వచ్చా రు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ప్రేమ్‌సింగ్, అధ్యక్షుడిగా తెలిపితియా శంకర్‌సింగ్, ఉపాధ్యక్షుడిగా గురుదేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా టాక్ ధర్మేందర్ సింగ్, సహాయక కార్యదర్శులుగా తెలిపితియా జాగ్‌బాల్‌సింగ్, తెలిపితియా సమ్‌షేర్‌సింగ్, కోశాధికారిగా టాక్ జాలిమ్‌సింగ్‌ను ఎన్నుకున్నారు.
20న ఆలేరులో
ఐటీఐ అప్రెంటిస్‌షిప్ మేళా
జనగామ రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 20న అప్రెంటిసిషిప్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ తెలిపారు. ఐటీఐ చదివి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ మేళాలో సుమారు 8 కంపెనీలు పాల్గొంటున్నాయని, మరిన్ని వివరా లకు 9866843920 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
నేటి నుంచి పోలీస్ క్రీడలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ మూడో వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–25 నేడు (శుక్రవారం) ఉదయం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా తెలిపారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ జోన్లతో పాటు పోలీస్ అనుబంధ విభాగాలు ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాలకు చెందిన క్రీడాకారులు 12 క్రీడాంశాల్లో పోటీ పడతారని వివరించారు. విజేతలుగా నిలిచిన పోలీస్ క్రీడాకారులకు క్రీడల ముగింపు రోజున బహుమతుల ప్రదా నం చేస్తామన్నారు. వారు వచ్చే నెలలో కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు బమ్మెర బాలిక ఎంపిక
పాలకుర్తి: జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు జహీరాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ విద్యనభ్యసిస్తున్న మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన మాడరాజు శ్రావ్యశ్రీ ఎంపికై ంది. ఈ మేరకు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బాధ్యుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బి.వీరన్న, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ యశ్వరావునగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రావ్యశ్రీ పాల్గొని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుందని వారు పేర్కొన్నారు. కాగా, జాతీయ స్థాయికి ఎంపికై న శ్రావ్యశ్రీని గ్రామస్తులతోపాటు ఆమె తండ్రి యాకయ్య, బంధు వులు అభినందించారు.
ప్లాస్టిక్ కవర్ల విక్రయం నిషేధం
● మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు
జనగామ: ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు, వినియోగాన్ని పట్ట ణంలో నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య ఆధ్వర్యాన కిరాణా వ్యాపారులతో నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు విక్రయించొద్దని, నిరంత రం నిఘా ఉంటుందని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవడంతో పాటు కొత్తగా తీసుకునే వారు దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. సమీక్షలో వ్యాపారులు కుమారస్వామి, వీరన్న, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికా రి పులి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment