మూడు రోజులు.. రూ.11.42 కోట్లు
జాతరను తలపించిన బెల్ట్ దుకాణాలు
జనగామ: సంక్రాంతి పండుగ మద్యం అమ్మకాల్లో రికార్డు బ్రేక్ చేసింది. మద్యం ప్రియులు న్యూ ఇయర్‌కు మించి తాగేశారు. భారీ కలెక్షన్లతో సర్కారుకు భారీ ఆదాయాన్ని సమకూర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగకు మద్యం వ్యాపారం పెరిగింది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో రూ.11.42 కోట్ల అమ్మకాలు జరుగగా, లిక్కర్, బీర్ కాటన్లు 23,103 అమ్ముడు పోయాయి. న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే రూ.8 కోట్ల మ్యం వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల వద్ద జన జాతర కొనసాగింది. జిల్లాలో 47 వైన్స్‌లు, 5 బార్లు ఉన్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల వ్యవధిలో రూ.11.42 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, లిక్కర్ కాటన్లు 12,940, బీర్ల కాటన్లు 10,163 సేల్ అయ్యాయి. అమ్మకాలను పెంచేందుకు ఎకై ్సజ్‌శాఖ ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. ఎక్కడెక్కడ సేల్ ఉంటుందనే నివేదికతో సంబంధిత లిక్కర్ మార్టు, మద్యం దుకాణా యజమానులపై కొనుగోలు పెంచాలనే లక్ష్యంతో టార్గెట్ విధించినట్లు సమాచారం. దీంతో ఆయా వైన్స్ యజమానులు ముందుగానే స్టాక్ డంప్ చేసుకోగా.. రెగ్యులర్‌గా డిపో నుంచి కంటిన్యూ అయింది. దీంతో ఎకై ్సజ్ శాఖ ఊహించిన దానికంటే అమ్మకాలు పెరగాయని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో గుడుంబా అమ్మకాలను నిషేధించినప్పటికీ, సంక్రాంతి పండుగ వేళ జోరుగా వ్యాపారం నడిచింది.
జిల్లాలో మద్యం అమ్మకాల్లో సర్కార్‌కు భారీ ఆదాయం
12,940 లిక్కర్ కాటన్లు, 10,163 బీర్ల కాటన్లు అమ్మకాలు
పండుగ సందర్భంగా బెల్ట్ దుకాణాలు జాతరను తలపించాయి. జిల్లా వ్యాప్తంగా 16 వందలకు పైగా బెల్ట్ దుకాణాలు ఉన్నట్టు సమాచా రం. ఇందులో కొన్ని చోట్ల వైన్స్‌లు, బార్లను మించి అమ్మకాలు జరి గినట్టు ప్రచారం జరుగుతుంది. 24 గంటల పాటు బెల్ట్ దుకా ణాల్లో లిక్కర్, బీర్లు, అనుబంధంగా ఆయా ప్రదేశాల్లో గుడుంబా అందుబాటులో ఉండడంతో పండుగ కలెక్షన్లు పెంచిందని భావిస్తున్నారు. ఇందులో ఎక్కువగా మైనర్లు, యువతే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment