సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
దేవరుప్పుల: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను యువత పరిరక్షించుకునేందుకు పాటుపడాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని హైస్కూల్‌లో హనుమాడ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి తాము చేపట్టే సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళల సామర్థ్యం, సృజనాత్మకతను వెలికి తీయడంలోనే ఆత్మవి శ్వాసం పెరుగుతుందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 257 మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ప్రథమ బహుమతి చింత సరితకు రూ.5 వేలు, ద్వితీయ కలకుంట్ల యామిని రూ.3 వేలు, తృతీయ బిట్ల లావణ్యకు రూ.2 వేల నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు హనుమాండ్ల రాజారాంమోహన్‌రెడ్డి, విజయడైరీ జిల్లా అధ్యక్షుడు కాసారపు ధర్మారెడ్డి, కొడకండ్ల మార్కెట్ చైర్‌పర్సన్ నల్ల అండాలు శ్రీరామ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తోటకూరి పాండుకృష్ణ, ఉప్పలయ్య, రామచంద్రునాయక్, గణేష్, జాకీర్, నాగరాజు, సజ్జన్, రవీందర్, నర్మద, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment