ఘనంగా ఎల్లవ్వ తల్లి బోనాలు
పాలకుర్తి: మండలంలోని బమ్మెర గ్రామంలో ఎల్లవ్వ తల్లి బోనాల పండుగ బుధవారం ఘనంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుల్ల వాయిధ్యాలతో మహిళలు బోనమెత్తి రావడంతో సందడి నెలకొంది. బోనాల పండుగకు జనగామ, మహబూబాబద్, వరంగల్, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పట్నాలు, మొక్కులు చెల్లించారు.
బోనమెత్తిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎల్లవ్వ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లవ్వ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ బమ్మెరలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఎల్లవ్వ తల్లిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ నాయకుడు రాపాక సత్యనారాయణ, తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, చిట్యాల అయిలమ్మ, మార్కెట్ చైర్ పర్సన్ లావుడ్య మంజుల, యాకయ్య, పసునూరి నవన్, ఎల్లయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment