18వ సప్తాహానికి సర్వం సిద్ధం
● పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో
ప్రవచనాలు
● 19న శోభాయాత్ర
జనగామ: జిల్లా కేంద్రం హెడ్ పోస్టాఫీస్ ఏరియా సంతోషిమాత ఆలయంలో 18వ సప్తాహానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. శ్రీస్కంద మహాపురాణం ప్రవచనం గురువు బ్రహ్మశ్రీ వేద పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు వినిపించనున్నారు. అష్టాదశ మహాపురాణాల్లో భాగంగా 2010 సంవత్సరంలో సంతోషిమాత ఆలయంలో మొదలైన ప్రవచనములు చివరగా 18వ పురాణం నిర్వహించేందుకు ఆలయ ప్రధాన పూజారి శ్రీనివాసశర్మ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు పురాణం మహేశ్వర శర్మను గుర్రపు రథంపై శోభాయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26 వరకు 18వ వేద వ్యాసచరిత స్కంద పురాణం ప్రవచనాలు వినిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment