‘పండుగలు మీకు.. పస్తులు మాకా?’
చిల్పూరు: ఉద్యోగ విరమణ పొంది ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో ఉండాల్సిన తమకు సరైన సమయంలో పెన్షన్ అందించకపోవడంతో పస్తులు ఉంటున్నామని పెన్షనర్ల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మేము దాచుకున్న మా డబ్బులు ఇవ్వాలంటే మేము చనిపోవాలా అని ప్రశ్నించారు. ఇటీవల కోర్టుకు వెళ్లిన వారికి చెల్లించడంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి జనవరి 26 వరకు పెన్షన్ డబ్బులు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంరెళ్లి తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం రాత్రి మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం శివుడికి పవిత్రమైన ప్రీతికరమైన ఆరుద్రోత్సవ కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం, 108లీటర్ల ఆవు పాలతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంద, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment