క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఛాగల్లు గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అనుమతితో స్వాగత్‌యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్స్ సోమవారం ముగిసాయి. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఛాగల్లు గ్రామం కబడ్డీకి కేరాఫ్‌గా మారిందని, గ్రామం నుంచి ఎందరో రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన జట్లకు నగదు బహుమతులు, షీల్డులు అందించారు.
గెలుపొందిన జట్లు ఇవే..
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమస్థానంలో రంగారెడ్డి జ్యోతిక్లబ్ (రూ.50,016), ద్వితీయ జనగామ జట్టు(రూ.40,016), తృతీయ నవశక్తి హైదరాబాద్ (రూ.30, 016), నాల్గవ హనుమకొండ జేఎన్‌ఎస్ (రూ.20,016), ఐదవ పాంనూర్ జట్టు(రూ.15,0160, ఆరవ బహుమతి ఛాగల్లు స్వాగత్‌యూత్ జట్టు (రూ.10,016) గెలుపొందారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్‌శర్మ, నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోటకూరి వెంకటేశ్వర్లు, శిరీష్‌రెడ్డి, గన్ను నర్సింహులు, రజాక్‌యాదవ్, కొలిపాక సతీష్, పొన్న రాజేష్, శ్రీరాములు, దోమల ప్రభాకర్, పల్లె రవీందర్, స్వాగత్ యూత్ అధ్యక్షుడు కూన రాజు, అన్నెపు కు మార్, చింతకింది సుధాకర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాపోటీలు
Comments
Please login to add a commentAdd a comment