గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి
జనగామ రూరల్ : సంక్షేమ పథకాల అమలుకు గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాల ని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్ట ర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి గ్రామ, వార్డు సభల నిర్వహణపై నిర్వహించిన జూమ్ మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు(రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. హాజరయ్యే ప్రజల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వం జారీ చేసిన సందేశాన్ని తప్పనిసరి చదివి వినిపించాలన్నారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి కొత్త దరఖాస్తులు, సర్వే పరిశీలన అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు. పథకా లకు సంబంధించిన జాబితాలు ప్రదర్శించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందని వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈ ఓ మాధురీషా, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, డిప్యూటీ సీఈఓ సరిత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
జనగామ: అర్హులకు సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చివరి రోజు సోమవారం పట్టణంలోని 19వ వార్డులో రేషన్ కార్డుల ప్రక్రియను ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి
కొత్త దరఖాస్తులు స్వీకరించాలి
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
ముగిసిన ఇంటింటి సర్వే..
జనగామ: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో భాగంగా ఈనెల 16 నుంచి ప్రారంభమైన ఇంటింటి సర్వే సోమవారం ముగిసింది. పంటల సాగుకు పనికిరాని 6,395 సబ్ డివిజన్ల(సర్వే నంబర్లు బైతో సహా) పరిధిలో 5,696 ఎకరాల భూమిని గుర్తించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు 9,986 దరఖాస్తులను పరిశీలించారు. కార్డులో కుటుంబ సభ్యులను చేర్చేందుకు 10,877(16,660 మంది సభ్యులు) వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ వందశాతం పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూరల్ పరిధిలో 1,33,345, అర్బన్‌లో 9,824 మొత్తం 1,43,187 అప్లికేషన్లకు సంబంధించి అర్హత వివరాలు సేకరించారు. అలాగే ఇందిర మ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నేటి(మంగళవారం) నుంచి 24 వరకు అర్హుల జాబితా ఎంపి క కోసం పట్టణ, గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment